Saturday, September 20, 2025
E-PAPER
Homeక్రైమ్పాము కాటుతో బాలుడు మృతి 

పాము కాటుతో బాలుడు మృతి 

- Advertisement -

నవతెలంగాణ – నిజాంసాగర్
పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మాచరెడ్డి మండల కేంద్రానికి చెందిన గంగుల రాజమణి తన తల్లి గారి ఇంటికి ఈనెల 12న తన కొడుకుని తీసుకొని మహమ్మద్ నగర్ కి వచ్చింది. రోజు మాదిరిగానే బుధవారం రోజు రాత్రి తిని పడుకున్నాకా.. గురువారం ఉదయం తెల్లవారుజామున కొడుకు భాస్కర్ కు (3) పాము కాటు వేసింది. గమనించిన తల్లి వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అయితే అక్కడి డాక్టర్ల సలహా మేరకు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భాస్కర్ మరణించాడని ఎస్సై తెలిపారు. తండ్రి గంగుల నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -