- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హెచ్ 1బీ వీసాలకు సంబంధించి లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సంతకం చేయడం, ఆ ఉత్తర్వులు ఈనెల 21వ తేదీ నుంచి అమల్లోకి రానుండటంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి చేసింది. ఈ పరిణామంపై మోడీని కాంగ్రెస్ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ట్రంప్ తొలిసారి దేశధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని ట్రంప్ దృష్టికి తీసుకురాకపోవడంపై మోడీని తాను 2017లోనే ప్రశ్నించానని గుర్తుచేశారు. ‘మోడీ బలహీన ప్రధాని. మళ్లీ ఇదే మాట చెబుతున్నా’ అని రాహుల్ తాజా ట్వీట్‌లో విమర్శించారు.
- Advertisement -