Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంఫాసిజం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నేడు సభలు, సెమినార్లు

ఫాసిజం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నేడు సభలు, సెమినార్లు

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హిట్లర్‌ ఫాసిజాన్ని 1945 మే తొమ్మిదిన సోవియట్‌ యూనియన్‌, కమ్యూనిస్టు పార్టీల ఎర్రసైన్యం ఓడిరచిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ఫాసిజం, సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా, శ్రామికవర్గ పోరాటాలను ఉధృతం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సభలు, సెమినార్లను నిర్వహించాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ పిలుపునిచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో శుక్రవారం సభలు, సెమినార్లను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులు, పాలకవర్గాలు హిట్లర్‌ నాజీయిజాన్ని పొంచి పోషించాయని తెలిపారు. భూగోళంలో కమ్యూనిజాన్ని లేకుండా చేస్తాడని ఆయనను ప్రోత్సహించి రష్యా, సోవియట్‌ యూనియన్‌ మీద దాడి చేయించడానికి పూనుకున్నాయని వివరించారు. స్టాలిన్‌ నాయకత్వాన 2 కోట్ల మంది సోవియట్‌ యూనియన్‌ ప్రజలు, సైన్యం తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించారని పేర్కొన్నారు. దాన్లో 30 లక్షల కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలొడ్డి, ఫాసిజాన్ని ఓడిరచి జర్మనీలోని బెర్లిన్‌ నగరానికి హిట్లర్‌ను తరిమికొట్టి అక్కడ ఎర్రజెండా ఎగురవేశారని తెలిపారు. అందువల్ల ఇప్పటికీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలను సాగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గతనెలలో 91 కమ్యూనిస్టు పార్టీలు రష్యాలో సమావేశమై సామాజ్రవాదం, ఫాసిజానికి వ్యతిరేకంగా భవిష్యత్‌లో పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయని తెలిపారు. కార్మిక పోరాటాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫాసిస్టు ధోరణులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆనాడు సోవియట్‌లో విప్లవం విజయవంతమైన తర్వాత దాన్ని ఓడిరచడానికి ఫాసిజాన్ని ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. భారత్‌లో కూడా ఇలాంటి ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాన్ని, ప్రజలను చైతన్యం చేస్తూ, శ్రామికవర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -