నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చౌడారపు రాంప్రసాద్ ను పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఘనంగా సత్కరించారు. నిజామాబాద్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైనందున హర్షం వ్యక్తం చేస్తూ ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు రాంప్రసాద్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు అవార్డు రావడం తమకెంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉత్తమ సేవలందించడం ద్వారా మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోనాపూర్, వాసన గట్టు తండా, కొత్తచెరువు తండా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధర్మేందర్, భాస్కర్, అరవింద్, గీత, హిమవతి, రామకృష్ణ, రాజరాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి తల్లిదండ్రుల సత్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES