Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న పూర్వ విద్యార్థులు 

పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న పూర్వ విద్యార్థులు 

- Advertisement -

నవతెలంగాణ- గోవిందరావుపేట 
తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో పూర్వ విద్యార్థులు తమకు తోచిన విధంగా తోడ్పాటును అందిస్తున్నారు. దీనిలో భాగంగా పోలే పెళ్లి రమేష్ 1999-2000విద్యా సంవత్సరంలో జడ్పీహెచ్ఎస్ చల్వాయి 10వ తరగతి చదువుకునీ హైదరాబాదులో చిరు ఉద్యోగం చేస్తూ పాఠశాల ఉన్నతికి తన సహకార అందిస్తున్నారు యునైటెడ్ హైదరాబాద్ ద్వారా పాఠశాల కి ఎన్జీవో ఆర్గనైజేషన్ ద్వారా ఎనలేని సేవలు అందించి ఉన్నారు.

 గత సంవత్సరం ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కొరకు పిల్లల డ్రాయింగ్ కోసం కేయన్స్ అలాగే125 క్లాస్మేట్ నోట్ బుక్స్ లు అందజేశారు. ఈ సంవత్సరం ఎస్ఎస్సి 2000 సంవత్సరం బ్యాచ్ చెందినటువంటి సూరప్పనిని కుషాల్ కుమార్ పోలేపల్లి రమేష్, మిట్టకంటి శ్రీనివాస్, దామల్ల సాంబయ్య మరియు కవిత లు ప్రింట్ చేసినటువంటి తెలుగు మరియు ఇంగ్లీషు చూచి వ్రాత కాపిల్ని సుమారు పదివేల రూపాయల  విలువ గలవి, వారి క్లాస్మేట్ ద్వారా అందజేశారు.

వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య  జెడ్ పి హెచ్ ఎస్ చల్వై ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బి శ్యాంసుందర్ రెడ్డి  ఉపాధ్యాయ బృందము ఆర్ వాసుదేవ రెడ్డి , మాధవి లత, కే సంజీవరాణి, వి పావని మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముందు ముందు కూడా ఇలాగే తోడ్పాటు అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -