– మరో 24 మంది నామినేట్ అయిన కమిటీ
– ఈ నెల 24 న ప్రమాణస్వీకారం
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆత్మ – ఏటీఎంఏ (అగ్రికల్చరల్ టెక్నికల్ మేనేజ్ మెంట్ ఏజన్సీ) పరిధిలో పనిచేసే బీఎఫ్ఏసీ (బ్లాక్ లెవెల్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ) బ్లాక్ స్థాయి రైతు సలహా కమిటీ (2025 – 2026) ని చైర్మన్ తో సహా మరో 24 మందిని మ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ నామినేట్ చేసారు.
స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచన మేరకు అశ్వారావుపేట నియోజక వర్గంలోని 5 మండలాల నుండి ఐదుగురు రైతులు చొప్పున 25 మందితో కమిటీని నామినేట్ చేసి,చైర్మన్ గా అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ వర్జీనియా పొగాకు,పామాయిల్ సాగు చేసే రైతు సుంకవల్లి వీరభద్రరావు ను ఎంపిక చేసారు.
ఈ కమిటి లో అన్నపు రెడ్డి పల్లి మండలం నర్సాపురం కు చెందిన సేంద్రీయ ఉద్యాన సాగు దారు దుబాకుల రాము ను రాష్ట్ర కమిటీ మెంబర్ గా, దమ్మపేట మండలం దమ్మపేట కు చెందిన ఉద్యాన, కూరగాయలు సాగు దారు పగడాల క్రిష్ణా రావు ను జిల్లా కమిటీ మెంబర్ గా నామినేట్ చేసారు.
ఈ కమిటీలో 25 మందిలో 16 మంది పురుషులకు,9 మంది మహిళా రైతులకు చోటు కల్పించారు. సామాజిక వర్గాల వారీగా 6 మందికి ఓసీ లు,మరో 7 మంది బీసీలు,10 మంది గిరిజనులు,ఇద్దరు ఎస్సీ రైతులు కు స్థానం దక్కింది.
చైర్మన్ గా ఎన్నికైన సుంకవల్లి వీరభద్రరావు 1981 స్థాపించబడిన తెలుగుదేశం పార్టీలో ఈ ప్రాంతంలో ముఖ్యులు.నాడే ఆ పార్టీ అశ్వారావుపేట మండల అధ్యక్షుడిగా,జిల్లా కమిటీ సభ్యులుగా పనిచేసారు.ఊట్లపల్లి ఎంపీటీసీ గా,అశ్వారావుపేట సొసైటీ ఉపాధ్యక్షులుగా ప్రాతినిద్యం వహించారు.అనంతరం టీఆర్ఎస్ లో క్రియాశీలకంగా మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు,మెచ్చా నాగేశ్వరరావు అనుచరులుగా ఉన్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో ఉన్నారు.ఈ నేపధ్యంలో ఈయనకు ఈ చైర్మన్ గిరీ దక్కింది.