Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల కమిటీ ఎన్నిక 

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల కమిటీ ఎన్నిక 

- Advertisement -

అధ్యక్ష, కార్యదర్శులుగా సోమయ్య, దీపక్ 
నవతెలంగాణ – పాలకుర్తి

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షునిగా వావిలాల గ్రామానికి చెందిన దొంగరి సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి గ్రామానికి చెందిన సింగారపు దీపక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని పెట్టేరు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడికట్టు మహేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది హరిబాబు లు తెలిపారు. శనివారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి కర్రే కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల కమిటీ ని ఎన్నుకున్నారని తెలిపారు. మండల అసోసియేట్ అధ్యక్షునిగా డి రమేష్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ సోమయ్య, సిహెచ్ ప్రమీల,  కార్యదర్శిగా ఎల్ రామస్వామి, సహాయ కార్యదర్శులుగా ఎండి కాసిం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పి బాలమల్లు, సోషల్ మీడియా సెక్రెటరీగా జి సరోజన లను ఎన్నుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సోమయ్య, దీపక్ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. మా నియమాకానికి సహకరించిన వ్యక్తి ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -