నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్తాన్ దాడులకు దిగడంతో ధర్మశాల బ్లాక్‌ఔట్‌గా మారిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో ఇరుజట్ల చెరో పాయింట్ కేటాయించారు. ధర్మశాలకు పొరుగున ఉన్న జమ్మూ, పఠాన్ కోట్‌లో దాడులు జరగడంతో ధర్మశాలలో కరెంట్‌ను ఆపేశారు. మొదట ఫ్లడ్‌లైట్ల సమస్య అని చెప్పినా తర్వాత పాక్ దాడులు మొదలుపెట్టడంతో వెంటనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు.
మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో బీసీసీఐ విచారం వ్యక్తం చేసింది. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్‌ను తక్షణమే ఖాళీ చేయించారు. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ప్రసార సిబ్బందిని సురక్షితంగా హోటల్‌కు తరలించారు ‘ప్లేయర్లందర్ని పఠాన్ కోట్‌కు రోడ్డు మార్గంలో తీసుకెళ్తాం. అక్కడి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలిస్తాం. ప్రస్తుతానికి మ్యాచ్ రద్దైంది. రేపటి పరిస్థితిని బట్టి టోర్నీ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి మాకు ఆటగాళ్ల భద్రత అత్యంత ముఖ్యమైంది’ అని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. అన్ని ఫ్రాంచైజీల్లో ఉన్న విదేశీ ప్లేయర్లు భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంతో పాటు తాజా పరిణామాల దృష్ట్యా లీగ్‌ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లీగ్ రద్దు గురించి ఎలాంటి సంకేతాలు లేవని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. వాటాదారుల ఇంట్రెస్ట్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. లక్నో, బెంగళూరు మ్యాచ్ నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి సందేహాలు లేవన్నారు.
పాకిస్తాన్ పై భారత్ దాడి మొదలు పెట్టడంతో పాకిస్తాన్ లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లిగ్ (PSL) మ్యాచ్ లను దుబాయ్ కి తరలించారు. ఈ నేపద్యంలో ఐపీఎల్ ను కూడా ఇతర దేశాలకు తరలించడం లేదా రద్దు చేసే అవకశాలు కనిపిస్తున్నాయి.
సరిహద్దులో ఉద్రిక్తతలు : ఐపీఎల్ రద్దు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES