– పాండురంగ్ ముతాలిక్ కు ఘన సన్మానం..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వారి ఆధ్వర్యంలో పండిత్ విష్ణు నారాయణ భాత్ఖండె గారి 165వ జయంతి మరియు ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారి 108వ జయంతి సందర్భంగా నిర్వహించిన సంగీతోత్సవం ఘనంగా నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం జి లావణ్య గారు కర్ణాటక గాత్రం, పి జయలక్ష్మి వీణ వాదన జి శ్వేత హిందుస్తానీ గాత్రం, బి పవన్ కుమార్ రెడ్డి వయోలిన్, ప్రధానధ్యాపకులు పాండురంగ్ ముతాలిక్ సితార్ కచేరి నిర్వహించగా వారికి మృదంగం పై రాజగోపాలాచారి, తబలా పై టీవీ రవి కాంత్ గారు మరియు అనంత్ న్యాల్కర్ కర్ హార్మోనియం పై సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సతీష్ కాశికర్ ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసులు ను కళాశాల ప్రధాన అధ్యాపకులు శాలువతో సత్కరించారు. అదే విధంగా కళాశాల ప్రధానధ్యాపకులు పాండురంగ్ ముతాలిక్ కు ఆకాశ వాణి ఏ గ్రేడ్ కళాకారులుగా గుర్తింపు వచ్చిన సందర్భంగా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది శాలువతో సత్కరించారు, వారితో కలిసి పనిచేయడం చాలా సంతోషం అని ఆనందం వ్యక్తం చేశారు.
సితార్ కచేరి అదరహో…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES