నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ఆదివారం ఆయన ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి ఆయన ఖాతాలో పాకిస్తాన్, టర్కీ జెండాల చిత్రాలను పోస్టు చేశారు. ఆసియా కప్ లో భాగంగా ఇవాళ భారత్- పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాకర్లు డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసి రెండు ఇస్లామిక్ దేశాల జెండాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. దాదాపు 30-45 నిమిషాల తర్వాత డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతాను తిరిగి తమ చేతుల్లోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. రాజకీయ నాయకులు, పార్టీల ఎక్స్ ఖాతాలను తరచూ హ్యాక్ కు గురవుతున్నాయి. గత జులైలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎక్స్ ఖాతాను తమ అదీనంలోకి తీసుకున్న హ్యాకర్లు క్రిప్టో చెల్లింపు చిరునామాతో పాటు చిప్ మంక్ అనే చిట్టెలుక ఫోటోను పోస్టు చేశారు. గతేడాది కాంగ్రెస్ అస్సాం యూనిట్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు.
డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతాలో పాక్ జెండా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES