నవతెలంగాణ – న్యూఢిల్లీ : నకిలీ ఆధార్ ఐడిలతో నకిలీ ఓట్లు వేయకుండా నిరోధించడానికి ఆధార్ కార్డులను చిప్‌లతో అనుసంధానించాలని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఔరైయీ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో చర్చలు జరిపారని ఎస్‌పి పార్టీ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కుల గణన చేపడితే రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతాయని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలు, దళితులు మరియు మైనార్టీలు (పిడిఎ) వర్గాల మధ్య ఐక్యత, బలం ప్రజల సమస్యలను పరిష్కరిస్తాయని అన్నారు. పిడిఎ వర్గాల కారణంగానే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మరిన్ని ఎంపి సీట్లు గెలుచుకుందని, ఆ ఎన్నికల్లో పార్టీ మూడవస్థానంలో నిలిచిందని అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే నకిలీ ఆధార్ ఐడిల ద్వారా నకిలీ ఓట్లు వేయకుండా నిరోధించడానికి ఆధార్ కార్డులను చిప్‌లతో అనుసంధానించాలని అన్నారు. సమాజంలో ద్వేషాన్ని నింపడం ద్వారా బిజెపి ప్రభుత్వం సమానత్వం, స్వేచ్ఛ మరియ సోదరభావాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. అన్ని రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని ధ్వంసం చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రణాళికాబద్ధంగా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకరతలు ఓటర్ల జాబితాలను నిశితంగా పరిశీలించి, తమ మద్దతుదారుల ఓట్లను కలిపేందుకు కృషి చేయాలని అన్నారు. బూత్ స్థాయి నుండి సంస్థను బలోపేతం చేయాలని అన్నారు.
నకిలీ ఓట్లను నిరోధించేందుకు ఆధార్ చిప్‌లతో అనుసంధానించాలి
- Advertisement -
- Advertisement -