జిల్లా పిఆర్టియు తెలంగాణ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి..
నవతెలంగాణ – తిమ్మాజిపేట
ప్రభుత్వం త్వరలో ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు జారీ చేస్తుందని జిల్లా పి ఆర్ టి యు తెలంగాణ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి అన్నారు. తిమ్మాజిపేట మండల పి ఆర్ టి యు తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో మండలం నుంచి పదోన్నతి పై వెళ్లిన ఉపాధ్యాయులను యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండలం నుంచి పదోన్నతి పైన వెళ్లిన నందకిశోర్, లక్ష్మి నారాయణ, రాధకృష్ణ, పవన్ లను సన్మానించారు. అలాగే జిల్లా పి ఆర్ టి యు తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్. సాయిరెడ్డి పదోన్నతి పై తిమ్మాజిపేట మండలానికి రావడంతో ఘనంగా సన్మానించారు.
అనంతరం సాయిరెడ్డి మాట్లాడుతూ .. రాష్ట్ర చరిత్రలోనె గతంలో ఎప్పుడు లేని విదంగా గత సంవత్సరo బదిలీలు, పదోన్నతి, ఈ సంవత్సరo కూడ పదోన్నతి ఇప్పించిన సంఘం ఈ ఘనత మనకే దక్కుతుందని అన్నారు. అదేవిదంగా పాఠశాలలు తెరచిన వెంటనే విద్యార్థులకు ఉచిత దుస్తులు, పాఠ్య పుస్తకాలు, ఈ సంవత్సరం నుండి నోట్ పుస్తకాలు ఇవ్వటం జరిగింది. అలాగే పాఠశాలల్లో స్కెవెంజర్ ల నియామకం, స్కూల్ గ్రాంట్ లు విడుదల చేయించటంలో రాష్ట్ర నాయకత్వం ముందుందన్నారు. అతి త్వరలో మిగిలిన పదోన్నతి పోస్ట్ లు కూడ ప్రభుత్వం భర్తీ చేస్తుందని, ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వనుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పి ఆర్ టి యు తెలంగాణ అధ్యక్షులు కొల్లి జైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పానుగంటి శేఖర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శివరాం గౌడ్ మండల గౌరవ అధ్యక్షులు సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పీ. అశోక్, తాడూర్ మండలం ఉపాధ్యయులు, బిజీనపల్లి మండలం అధ్యక్షులు శివశంకర్, రాజు, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
త్వరలో ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు జారీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES