Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోహెడలో కొండ లక్ష్మణ్‌బాపూజీ వర్ధంతి వేడుకలు

కోహెడలో కొండ లక్ష్మణ్‌బాపూజీ వర్ధంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంలోని పద్మశాలీ సంఘం ఆవరణలో, అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ 13వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కొండబత్తిని రాజలింగం ఆధ్వర్యంలో, అంబేద్కర్‌ చౌరస్తా వద్ద జాతీయ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో వేరువేరుగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంకుశ పాలన, ఆర్థిక దోపిడిని వ్యతిరేకించి, వృత్తి పనివారలను సంఘటిత పరచడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమాలలో గోవిందు సావిత్రి, గాజుల రాజేశం, ఆకుబత్తిని భూమయ్య, గోవిందు సురేష్‌, గాదాసు శ్రీనివాస్‌, నరాల శ్రీకాంత్‌, కొండబత్తిని సతీష్‌, గాజుల శంకర్‌, వడ్డెపల్లి రాజేంద్రప్రసాద్‌, వడ్డెపల్లి రామకృష్ణ, వడ్డెపల్లి ప్రవీణ్‌, ఆదిత్య,సాయిరాం, శ్రీనివాస్‌, ముంజ సదానందం, మంద మల్లేషం, లింగాచారి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -