- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ సమయంలో.. ప్రజల్లో కొంత ఆందోళన, కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే నివృత్తి చేస్తుంది. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య హైటెన్షన్.. నెలకొన్న సందర్భంలో ఇండియన్ ఆయిల్ సంస్థ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇంధన సరఫరాలో కూడా ఎటువంటి ఆటంకాలు లేవని ఓ ప్రకటనలో పేర్కొంది.
- Advertisement -