Saturday, May 10, 2025
Homeజాతీయంస‌రిహ‌ద్దుల్లో కాల్పులు.. తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

స‌రిహ‌ద్దుల్లో కాల్పులు.. తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

- Advertisement -

న‌వతెలంగాణ -హైద‌రాబాద్ : ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ ఆప‌రేష‌న్‌ను సహించ‌లేని దాయాది పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ధితో భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతాల‌పై క్షిప‌ణి, డ్రోన్ దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఈ క్రమంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో పాకిస్థాన్ జ‌రిపిన కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందారు. మృతిచెందిన జ‌వాన్‌ను ముర‌ళీ నాయ‌క్‌గా గుర్తించారు. వీర జవాన్‌ది ఏపీలోని స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌ల ప‌రిధిలోని క‌ల్లి తండా. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు వెంబ‌డి పాక్ కాల్పులు జ‌ర‌ప‌గా మ‌న సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ముర‌ళీ నాయ‌క్ చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం. శ‌నివారం స్వ‌గ్రామానికి వీర జ‌వాన్ పార్థివ దేహం రానున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -