Monday, September 22, 2025
E-PAPER
Homeక్రైమ్స్కూల్‌లో వేధింపులు..సైన్స్ టీచర్ ఆత్మహత్య

స్కూల్‌లో వేధింపులు..సైన్స్ టీచర్ ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : స్కూల్ లో వేధింపులు తట్టుకోలేక సైన్స్ టీచర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,అస్సాం రాష్ట్రానికి చెందిన మార్కస్ బాగే (33) తండ్రి పియుష్ బాగే అనే అతనికి ఎనిమిది సంవత్సరాల క్రితం జూలీ లోవాని(29) తో ప్రేమ వివాహం జరిగింది కాగా వీరు జీవనోపాధి కోసం అస్సాం రాష్ట్రం నుండి హైదరాబాద్ కు వలస వచ్చి అబ్దుల్లామెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో నివాసం ఉంటుంన్నారు అతని భార్య జూలీ లోవాని ఇండస్ వ్యాలీ స్కూల్ లో సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది అదే స్కూల్ లో పని చేసే ఇబ్రహీం, జునైద్ లు గత ఆరు నెలలుగా ఆమెను వేదిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు దింతో ఆమె తీవ్ర మనోవేదన గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితులను అదుపులోకి విచారణ చేసున్నారు పోలీసులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -