Monday, September 22, 2025
E-PAPER
Homeజాతీయంఎయిరిండియా విమాన ప్రమాదం.. ప్రాథమిక నివేదికపై సుప్రీం అసహనం

ఎయిరిండియా విమాన ప్రమాదం.. ప్రాథమిక నివేదికపై సుప్రీం అసహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఘటనపై దర్యాప్తు పూర్తికాకముందే.. పైలట్‌ ఇంధన కంట్రోల్‌ స్విచ్‌లు ఆఫ్‌ చేశారేమో అన్నట్లుగా ప్రాథమిక నివేదిక ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు పేర్కొనడాన్ని తప్పుబట్టింది. ఇది బాధ్యతారాహిత్యమేనని తెలిపింది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -