- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు తెలుగు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజీ’ ట్రైలర్ వచ్చేసింది. ఆదివారం ఉదయమే రిలీజ్ చేస్తామని ఊరించిన చిత్ర బృందం.. తాజాగా విడుదల చేసింది. పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్స్, తమన్ నేపథ్య సంగీతం ట్రైలర్‌లో హైలైట్‌గా ఉన్నాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ ఓజాస్ గంభీరగా నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. ఈ సినిమా ఈ నెల 25న బాక్సాఫీసు ముందుకు రానుంది.
- Advertisement -