- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాక్‌పీట్ డోర్ తీసేందుకు ఎనిమిది మంది ప్రయాణికులు యత్నించారు. విమానం హైజాక్ అవుతుందన్న భయంతో పైలట్ డోర్ తెరవలేదు. విమాణం వారణాసి చేరుకున్నాక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -