Monday, September 22, 2025
E-PAPER
Homeజాతీయంకేర‌ళ‌తో కేంద్రం శ‌త్రుత్వం: సీఎం పిన‌ర‌యి విజ‌యన్

కేర‌ళ‌తో కేంద్రం శ‌త్రుత్వం: సీఎం పిన‌ర‌యి విజ‌యన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కేర‌ళ ప‌ట్ల కేంద్రం శ‌త్రుత్వం వ‌హిస్తుంద‌ని ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌యన్ ఆరోపించారు. నిధుల మంజూరులో, అభివృద్ధిలో కేంద్ర ప్ర‌భుత్వం చొర‌వ చూప‌డంలేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం-స్థానిక సంస్థల అభివృద్ధి విజయాలు, భవిష్యత్తు అభివృద్ధికి సూచనలు అనే వికాసనా సదస్సు రాష్ట్ర స్థాయి కార్య‌క్రమాన్ని ఆయ‌న‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. న్యాయ‌మైనా రాష్ట్ర వాటా కోసం ప్ర‌జ‌ల త‌రుపున‌ తరుచుగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. మ‌న దేశం ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌కు సూచిక‌ని, ప్రజాస్వామ్య బ‌ద్ధంగా కేర‌ళ ప‌ట్టుద‌ల‌తో పోరాటం సాగిస్తుంద‌ని తెలిపారు.

కేర‌ళ అన్ని రంగాల్లో గ‌ణ‌నీయ‌మైనా అభివృద్ధిని సాధించింద‌ని, కేరళ అత్యల్ప శిశు మరణాల రేటును కూడా సాధించింది, ఇది యునైటెడ్ స్టేట్స్ కంటే కూడా తక్కువ” అని ఆయన అన్నారు. కేర‌ళ‌లో అనేక మార్పులు ఇప్ప‌టికే అంద‌రికీ క‌నిపిస్తున్నాయి, ఇంత‌టితో త‌మ ప్ర‌య‌త్నం ఆగ‌ద‌ని, మ‌రింత పురోగ‌తి సాధించడానికి దృఢ సంక‌ల్పంతో తాము ముందుకెళ్తామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తతో అనేక మైలురాళ్లు దాట‌మ‌ని, అదే స్పూర్తితో అభివృద్దిని కొన‌సాగిస్తామ‌న్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే నిజమైన యజమానులని, ఎన్నిక‌ల హ‌మీల మేర‌కు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నామ‌ని, ప్ర‌జ‌ల‌ అవ‌స‌రాల‌కు అనుగుణంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించామ‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -