Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుభారత్-పాక్ ఉద్రిక్తతపై స్పందించిన రష్మిక మందన్న

భారత్-పాక్ ఉద్రిక్తతపై స్పందించిన రష్మిక మందన్న

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంక్లిష్ట సమయంలో ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న ఒక ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా భారత సైన్యానికి తన మద్దతును తెలియజేశారు.రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో భారత సైన్యానికి మద్దతుగా పలు పోస్టులను పంచుకున్నారు. రెచ్చగొట్టే చర్యలకు, ఆత్మరక్షణ కోసం అవసరమైన ప్రతిఘటనకు మధ్య ఉన్న నైతిక విలువల గురించి ప్రస్తావిస్తూ ఒక పోస్ట్‌ను ఆమె రీషేర్ చేశారు. ఁశాంతిని కోరుకోవడం అంటే నిశ్శబ్దంగా ఉంటూ హానిని అంగీకరించడం కాదుఁ అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించాలని ఆమె అభిప్రాయపడ్డారు.మరొక స్టోరీలో, నైజీరియన్ రచయిత్రి చిమామండ అడిచే ప్రసంగానికి సంబంధించిన వీడియోను రష్మిక పంచుకున్నారు. ఎల్లప్పుడూ మంచిగా ఉండటం ద్వారా ప్రపంచాన్ని మెరుగ్గా మార్చలేమనే భావాన్ని ఆ వీడియో తెలియజేసింది. ఁదయతో ఉండండి. కానీ అవసరానికి మించి మంచిగా ఉండకండిఁ అనే వ్యాఖ్యతో ఆమె ఆ వీడియోను షేర్ చేశారు. ఈ పోస్టుల ద్వారా రష్మిక పరోక్షంగా దేశ రక్షణ చర్యలకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad