Monday, September 22, 2025
E-PAPER
Homeజాతీయంపీఎం మోడీ.. విదేశీ వ‌స్తువుల వాడ‌కం మానేయండి: కేజ్రీవాల్‌

పీఎం మోడీ.. విదేశీ వ‌స్తువుల వాడ‌కం మానేయండి: కేజ్రీవాల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని ప్రజలకు పిలుపు ఇవ్వడానికి ముందు మీరు దాన్ని ఆచరించాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీరు వాడుతున్న విదేశీ వస్తువులను వదిలేస్తారా..? అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ప్రజలు స్వదేశీ వస్తువులను వినియోగించాలని మీరు కోరుతున్నారు. అయితే మీరు స్వదేశీ వస్తువులను వినియోగించడం మొదలుపెడుతారా..? మీరు రోజూ తిరుగుతున్న విదేశీ విమానాన్ని వదిలేస్తారా..? రోజంతా మీరు వినియోగిస్తున్న విదేశీ వస్తువులను విడిచిపెడుతారా..?’ అని ప్రశ్నించారు. దేశంలో ఉన్న నాలుగు అమెరికా కంపెనీలను మీరు మూసేస్తారా..? డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ను, భారత ప్రజలను రోజూ అవమానిస్తున్నారు. దీనిపై మీరు ఏమీ చేయలేరా..? భారత ప్రజలు వారి ప్రధాన మంత్రి నుంచి చర్యలు కోరుకుంటున్నారు. ఉపదేశాలు కాదు’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -