Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మా నాన్నకు సపాయి పని ఇప్పించాలి.!

మా నాన్నకు సపాయి పని ఇప్పించాలి.!

- Advertisement -

ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చెసిన సమ్మయ్య..
నవతెలంగాణ – మల్హర్ రావు

మా నాన్నకు సపాయి పని తనకు ఇప్పించాలంటూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో తాడిచెర్ల గ్రామానికి చెందిన ఇందారపు సమ్మయ్య భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను పిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడార. తన తండ్రి ఇందారపు రాజపోచం 20 సంవత్సరాలకు పైగా పంచాయతీ కార్యాలయంలో సపాయి కార్మికునిగా విధులు నిర్వహించడని తెలిపారు. తన తండ్రి అనారోగ్యంతో పదేళ్ల క్రితం మరణించడంతో తాను సపాయి కార్మికుడిగా 5ఏళ్ళు విధులు నిర్వహించిన నేపథ్యంలో మూడేళ్ళ జీతం ఇచ్చి,రెండేళ్ల జీతం ఇవ్వలేదన్నారు. అయితే తాను అనారోగ్యంతో ఒక సంవత్సరం పాటు పనికి వెళ్లకపోవడంతో తన తండ్రి స్తానంలో తన పేరు ఆన్లైన్ చేయకుండా మరొక్కరి వద్ద అమ్యామ్యాలు తీసుకొని అతని పేరు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి ఇరవై ఏళ్లుగా జిపిలో సపాయి కార్మికుడుగా విధులు నిర్వహించినట్లుగా వివరాలను ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని వినతిలో వాపోయాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -