- Advertisement -
- పల్లె దవాఖాన వైద్యుల డిమాండ్..
- నవతెలంగాణ – సుల్తాన్ బజార్
- ఆరోగ్య తెలంగాణ కోసం పని చేస్తున్న తమ సమస్యల పరిష్కారించాలని పల్లె దవాఖాన వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కోఠి లోని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…గ్రామ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో తమను నియమించారని అన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఉన్న మూడు వేల పల్లె దవాఖాన లలో తాము పని చేస్తూ , ఒక్కొక్క వైద్యుడు ఐదు గ్రామ పంచాయితీ లలో ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు.
తమపై పని భారం ఉన్నప్పటికీ గ్రామాలలో ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. అయితే రోగులు , వారికి అందించిన సేవల వివరాలను ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలంటూ , అధికారులు తమ పై మరో భారాన్ని మోపుతున్నారని వాపోయారు. తాము వైద్యులమని , డేటా ఎంట్రీ ఆపరేటర్లము కాదని తెలిపారు. తమపై ఈ అదనపు భారాన్ని తొలగించి , తమ అందిస్తున్న 40 వేల జీతాన్ని 65 వేలకు పెంచాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు.తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వైద్యులు హెచ్చరించారు.
- Advertisement -