నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి సోమవారం తెలిపారు. ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణం టౌన్-I పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 19 న తూంపల్లి గ్రామానికి చెందిన భూక్య విట్టల్ వ్యక్తి తన బైక్ నం. టీఎస్ 16 ఈఎక్స్ 8578 ను ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద పార్క్ చేసి లోపలికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు బైక్ కనిపించకపోవడంతో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
అలాగే సెప్టెంబర్ 22వ తేదీ , 2025న దేవి రోడ్ వద్ద వెహికిల్ చెకింగ్ జరుగుతుండగా, అటుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు దొంగిలించిన బైక్ పై వస్తు పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా వారిని పట్టుకొని విచారించగా వారు హనువాతే భీమ్, హనువాతే సుభాష్ ఒవైసీ నగర్, భైంసా, ప్రస్తుతం 50 క్వార్టర్స్, నిజామాబాద్ అని తెలిపి వారు మద్యం, జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లో కూడా బైక్ దొంగతనాలు చేసినట్టు వెల్లడించారు. వారి వద్ద నుండి 4 బైక్‌లు స్వాధీనం చేసుకుని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
బైక్ దొంగలు అరెస్ట్.. రిమాండుకు తరలింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES