పివైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగు అనిల్
నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు ఈనెల 25, 26 తేదీ లలోని సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ లో రెండు రోజులపాటు నిర్వహిస్తారని దానిలో పాలు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పివైఎల్ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగు అనిల్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పని విధానం కామ్రేడ్ బండారు ఐలయ్య పి వై ఎల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, మతం పాసిజం అంబటి నాగయ్య ,విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు కామ్రేడ్ జేవీ చలపతిరావు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, నిరుద్యోగ సమస్య–కామ్రేడ్ గౌని ఐలయ్య సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మార్కిస్ట్ మహాపాద్యాయుల జీవిత చరిత్ర–కామ్రేడ్ మధు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. కావున యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES