నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని రైల్వే గేట్ తో పాటు దర్యాపూర్, మహంతం, ధర్మారం రైల్వే గేట్ ల వద్ద బ్రిడ్జిల నిర్మాణం కోసం రైల్వే, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని మెయిన్ రైల్వే గేట్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి, దర్యాపూర్, మహంతం, ధర్మారం ల వద్ద మ్యానువల్ గేట్లను తొలగించేందుకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణాల సాధ్యా సాధ్యలపై పరిశీలించి నివేదికను తయారు చేసి, పలు శాఖల నుండి త్వరితగతిన క్లియరెన్స్ అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ సురేష్, రైల్వే సెక్షన్ ఆఫీసర్ రవి ప్రకాష్, నిజామాబాద్ ఆర్డిఓ రాజేందర్ కుమార్, తహసిల్దార్ ధన్వాల్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.