నవతెలంగాణ-హైదరాబాద్ : ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్ సమయంలో 4 సార్లు తాను చనిపోయేంత ప్రమాదం జరిగిందని.. ఆ దేవుడే తనను కాపాడాడని రిషబ్‌శెట్టి అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అందులో రిషబ్, రుక్మిణి వసంత్ పాల్గొన్నారు. కాంతార షూటింగ్‌లో జరిగిన ప్రమాదాల గురించి రిషబ్ స్పందించారు.
షూటింగ్ సమయంలో తనకు నాలుగుసార్లు ప్రమాదం జరిగిందని రిషబ్ తెలిపారు. అప్పుడే తాను చనిపోయేవాడినేనని, ఆ దేవుడే తనను కాపాడాడని అన్నారు. ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈ చిత్రం పూర్తయిందని చెప్పారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా మూడు నెలలు నిరంతరం పని చేసిందని విశ్రాంతి కూడా తీసుకోలేదని తెలిపారు. ప్రతిఒక్కరూ దీన్ని వారి సొంత సినిమాగా భావించారని చెప్పారు. అలా అనుకున్నారు కాబట్టే ఎన్నో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించగలిగామన్నారు. సెట్‌లో ఎన్నో ప్రమాదాలు జరిగాయని..అవన్నీ మీడియాలో వచ్చాయని వివరించారు.