- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్–విశాఖ ప్రయాణికులకు శుభవార్త. ఖమ్మం–దేవరపల్లి మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-365BG) నిర్మాణం వేగంగా సాగుతోంది. రూ.4,609 కోట్లతో 162 కి.మీ హైవే 2026 జనవరికి సిద్ధం కానుంది. ఇది పూర్తైతే 12 గంటల ప్రయాణం 8 గంటల్లో ముగియనుంది. 125 కి.మీ దూరం, 5 గంటల సమయం ఆదా అవుతుంది. ఈ రహదారి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల గుండా వెళ్తుంది. దీనివల్ల సరకు రవాణా సులభతరం అవ్వడంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాణిజ్యం, ప్రయాణాలు వేగవంతం అవుతాయి.
- Advertisement -