Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

వరి పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

- Advertisement -

నవతెలంగాణ – దామరచర్ల
దామరచర్ల మండలంలో కొండ్రపోలు , అడదేవుపల్లి మండలం లోని ఉల్షాయిపాలెం గ్రామాలలోని వరి పొలాలను ప్రతి గ్రామంలో నాణ్యత గల విత్తనాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త టీ కిరణ్ బాబు డాక్టర్ అరుణశ్రీ లు మాట్లాడుతూ కేఎన్ఎమ్ 1638 వరి రకంలో సాగులో మెలకువలను తెలిపారు.  ఆకు చుట్టుపరుగు, పాము పొడ,సుడిదోమ తెగుళ్ళ నివారణ చర్యలను రైతులకు వివరించారు. ఈ నాణ్యత గల విత్తనాలతో రైతులు సాగు చేసుకుని తదుపరి గ్రామ రైతులందరికీ వచ్చే సీజన్ విత్తనాలుగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రుషేంద్రమని, సరిత , వ్యవసాయ విస్తరణ అధికారులు ఆర్ పార్వతి, ఏ సైదులు, నరేష్ రైతులు కొడాలి ప్రభాకర్ రావు, పులి సైదులు, వి.భీమా నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -