నవతెలంగాణ-హైదరాబాద్: 80వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో యురోపియన్ కమిషన్ చీప్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల తీర్మానంతో..పాలస్తీనాకు ఉపశమనం లభిస్తుందని, దీంతో గాజాను పునర్మించొచ్చని, త్వరలో పాలస్తీనా డోనర్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని, ఆయా దేశాల దాతల సహకారంతో అన్ని విధాలుగా పాలస్తీనాను తీర్చిదిద్దుతామని తెలిపారు. గాజా పునర్ నిర్మాణంలో భాగంగా యూరోపియన్ యూనియన్ చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆమె దీమావ్యక్తం చేశారు. ఏకైక వాస్తవిక శాంతి ప్రణాళిక తాము ప్రతిపాదించిన రెండు దేశాల తీర్మానంపై ఆధారపడి ఉందని, సురక్షితమైన పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలు అవతరించనున్నాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
పాలస్తీనాలో ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుంది. ఈ మారణోమాన్ని అడ్డుకోవడానికి యూరోపియాన్ దేశాలు నడుంబిగించాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ దాడులను సహించేది లేదని స్పష్టం చేశాయి. దీంతో ప్రత్యేక దేశంగా పాలస్తీనాను గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై పలు ఆయా దేశాలు మద్ధతు తెలిపాయి. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తో పలు దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించాయి.