పోషకాహారంపై అవగాహన: సీడీపీఓ విజయలక్ష్మి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని నెల్లికుదురు సెక్టర్ పరిధిలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించామని సీడీపీఓ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ నాగమణి తో కలిసి పోషకాహార ప్రదర్శన, బతుకమ్మలు, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని నెల్లికుదురు సెక్టార్ పరిధిలో కిశోర బాలికలకు తల్లులకు గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారం పై అవగాహన కల్పించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత తదితర విషయాలపై కులం కుశంగా వివరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
ఘనంగా పోషణ మాసం కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES