Tuesday, September 23, 2025
E-PAPER
Homeజాతీయం‘దాదా సాహెబ్ ఫాల్కే’ స్వీక‌రించిన మోహ‌న్ లాల్

‘దాదా సాహెబ్ ఫాల్కే’ స్వీక‌రించిన మోహ‌న్ లాల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ సినిమా రంగంలోనే అత్యున్నతమై దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును స్వీక‌రించారు. మంగ‌ళ‌వారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన విజ్ఞాన భ‌వ‌న్ లో అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీద‌గా ఆయ‌న అవార్డును అందుకున్నారు. 2023 ఏడాదికి గానూ మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రదానం చేసింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్న మోహన్ లాల్.. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 400కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటనకు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు, పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి పురస్కారాలు లభించాయి. మలయాళ సినీ పరిశ్రమ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న రెండో వ్యక్తి మోహన్ లాల్. గతంలో ప్రముఖ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్‌కు ఈ అవార్డు లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -