Wednesday, September 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో ఫ్రాన్స్ అధ్య‌క్షునికి చేదు అనుభ‌వం

అమెరికాలో ఫ్రాన్స్ అధ్య‌క్షునికి చేదు అనుభ‌వం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్‌ మేక్రాన్ చేదు అనుభ‌వం ఎదురైంది.ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు మేక్రాన్‌ అమెరికాకు వచ్చారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని రాత్రి బసచేసేందుకు ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయానికి బయల్దేరారు. ఇలా తన సొంత కాన్వాయ్‌లో వెళ్తున్నప్పుడు న్యూయార్క్‌ నగర పోలీసులు ఈ కాన్వాయ్‌ను అడ్డుకుంది. ఇదే మార్గంలో ట్రంప్‌ కాన్వాయ్‌ వెళ్లబోతోందని, అది వెళ్లేదాకా పక్కకు ఆగి వేచి ఉండాలని వాహన శ్రేణి డ్రైవర్లను న్యూయార్క్‌ సిటీ పోలీసులు ఆదేశించారు.

అయితే చాలాసేపు వేచిచూసిన మేక్రాన్‌ ఎంతకీ ట్రాఫిక్‌ ముందుకు కదలకపోవడంతో విసిగెత్తి కారు నుంచి కిందకు దిగి ఎదురుగా ఉన్న పోలీసుల వద్ద విషయం ఆరాతీశారు. వాళ్లు తాపీగా అసలు విషయం చెప్పారు. వెంట‌నే ట్రంప్ కు ఎమ్మాన్యు యేల్‌ మేక్రాన్ ఫోన్ చేశారు. ఎలా ఉన్నారు? ఇక్కడ ఏం జరిగిందో ఊహించగలరా? మీ కాన్వాయ్‌ వెళ్తోందని రోడ్లపై కార్లను ఆపేశారు. దీంతో నేను నడిరోడ్డుపై ఆగిపోయా. మీ కాన్వాయ్‌ వెళ్లిన తర్వాత ఎంబసీకి వెళ్దామని వేచిచూస్తున్నా’’ అని మేక్రాన్ మాట్లాడార‌ని ప‌లు మీడియా క‌థ‌నాలు వెలువ‌రించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -