నవతెలంగాణ-హైదరాబాద్: బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సారథ్యంలో ‘మన బతుకమ్మ- 2025 పేరిట రూపొందించిన పాట ఇవాళ విడుదల కానుంది. కాగా, ఈ పాటకు సంబంధించిన ప్రోమోను పర్యాటక శాఖ మంగళవారం సామాజిక మాద్యమల్లో పంచుకుంది. ప్రముఖ ప్రజాకవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అద్భుతమైన సాహిత్యం అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ‘ఓ తంగేడు పూల తల్లి బతుకమ్మ అంటూ’ సాగే ఈ పాటలను అదితి భవరాజ, మంగ్లీ, గోరటి వెంకన్న కలిసి పాడారు. ఈశ్వర్ పెంటి నృత్య రూపకల్పన చేశారు. తెలంగాణ పల్లె దృశ్యాలు, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా దర్శకులు బద్రప్ప గాజుల అద్భుతంగా తెరకెక్కించారు.
‘ఓ తంగేడు పూల తల్లి బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES