Wednesday, September 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభార‌త్ మా వైపే: ఉక్రెయిన్

భార‌త్ మా వైపే: ఉక్రెయిన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇండియా ఎగుమ‌తుల‌పై అద‌న‌పు సుంకాలు విధించారు. ఈ క్ర‌మంలో ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.భారత్ చాలావరకు మా వైపే ఉంది. ఇంధన రంగంలో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ వాటిని పరిష్కరించుకోవచ్చు” అని అన్నారు. భారత్‌కు ఇంధన అవసరాలు ఉన్నాయని, ఈ సమస్యకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపితే బాగుంటుందని ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -