Wednesday, September 24, 2025
E-PAPER
Homeవరంగల్విద్యుత్తు వైరు తెగిపడి పాడి గేదె మృతి 

విద్యుత్తు వైరు తెగిపడి పాడి గేదె మృతి 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
మండలంలోని ప్రాజెక్టు నగర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో 11.00 గంటలకు గాలి వానకు విధ్యుత్ తీగ తెగి పడి  తోలేం రామారావు అనే రైతు పాడి గేదె మృతి చెందింది. బుధవారం గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గేదె విలువ సుమారు 70,000 వేల రూపాయల ఖరీదు చేస్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. రామారావు కుటుంబము వ్యవసాయంతో పాటు పాడి గేదే ఇస్తున్న ఐదు లీటర్ల పాలపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు.  పాడి గేదె చనిపోవడం రామారావు కుటుంబ సభ్యులలో ఒకరిని కోల్పోయినట్టుగా ఉందని, అంతగా బాధిస్తుందని, ప్రభుత్వం ప్రధానంగా విద్యుత్ శాఖ స్పందించి రామారావు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా విద్యుత్ అధికారులు అప్రమత్తతో ఉండాలని గ్రామ ప్రజలు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -