- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. కర్ణాటక ప్రాజెక్టులు, భీమా నది నుంచి వస్తున్న నీటితో ప్రాజెక్టు నిండింది. మంగళవారం 43 గేట్లు తెరిచి 2,97,904 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి, లిఫ్టులు, కాలువల ద్వారా మొత్తం 3,25,354 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో 317.910 మీటర్ల వరకు నీటిని నిల్వ ఉంచారు.
- Advertisement -