Wednesday, September 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంతైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్.. 14 మంది మృతి

తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్.. 14 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సూపర్ తుఫాన్ రాగస తైవాన్, చైనాలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. తైవాన్‌లోని హువాలియన్‌లో బారియర్ సరస్సు ఉప్పొంగడంతో 14 మంది మరణించగా, 124 మంది గల్లంతయ్యారు. కార్యాలయాల్లోకి నీళ్లు చేరి బీభత్సం సృష్టించాయి. ఈ తుఫాన్ ప్రస్తుతం చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, హాంకాంగ్ వైపు దూసుకుపోతోంది. బుధవారం మధ్యాహ్నం-సాయంత్రం మధ్యలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తైషాన్, ఝాంజియాంగ్ మధ్య రాగస తుఫాన్ తీరాన్ని తాకుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -