Wednesday, September 24, 2025
E-PAPER
HomeజాతీయంNEET Student Suicide: నీట్‌లో 99.99 శాతం సాధించిన విద్యార్థి… అడ్మిషన్‌ రోజే ఆత్మహత్య

NEET Student Suicide: నీట్‌లో 99.99 శాతం సాధించిన విద్యార్థి… అడ్మిషన్‌ రోజే ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: నీట్‌లో 99.99 శాతం సాధించి, కళాశాల అడ్మిషన్ రోజే వైద్య విద్యను అభ్యసించడం ఇష్టం లేక ఓ విద్యార్థి ప్రాణాలు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నవర్‌గావ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి.. ఇటీవల నీట్‌ యూజీ-2025లో 99.99 శాతం సాధించాడు. జాతీయ స్థాయిలో 1475 ర్యాంకు పొందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లోని కళాశాలలో ఎంబీబీఎస్‌ కోర్సులో అడ్మిషన్‌ తీసుకోవాల్సి ఉంది. అక్కడికి వెళ్లేందుకు అంతా సిద్ధం అవుతుండగా.. ఆ విద్యార్థి తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అడ్మిషన్ తీసుకొని, వైద్యవిద్యను పూర్తి చేస్తాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం షాక్‌కు గురైంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు. ఆ నోట్‌లో ఉన్న పూర్తి వివరాలు బయటకు వెల్లడికానప్పటికీ.. తనకు ఎంబీబీఎస్ చదవాలని లేదని ఆ విద్యార్థి అందులో పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -