Wednesday, September 24, 2025
E-PAPER
Homeజాతీయంత్వరలో ఈపీఎఫ్‌ఓ ATM విత్‌డ్రా సదుపాయం..!

త్వరలో ఈపీఎఫ్‌ఓ ATM విత్‌డ్రా సదుపాయం..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బ్యాంకు ఖాతా మాదిరిగా ఈఎఫ్‌ఓవో చందాదారులు ఏటీఎం ద్వారా తమ పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈపీఎఫ్‌ఓ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారని ‘మనీ కంట్రోల్‌’ పేర్కొంది. అక్టోబర్‌ రెండో వారంలో ఈ సమావేశం జరగనుందని సంబంధిత వర్గాలను ఉటంకించింది.

ఏటీఎం నగదు విత్‌డ్రా సదుపాయాన్ని ఈ ఏడాది జూన్‌ నుంచే అందుబాటులోకి తేనున్నట్లు కార్మికశాఖ తొలుత ప్రకటించింది. ఇందుకోసం దీనికి సంబంధించిన ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా సిద్ధం చేసింది. అయితే, విత్‌డ్రాలకు సంబంధించి విధించాల్సిన పరిమితి గురించి బోర్డు ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిమితి విధించకపోతే ‘భవిష్యనిధి’ అసలు లక్ష్యం నీరుగారిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ బోర్డు దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -