Friday, October 17, 2025
E-PAPER
Homeకరీంనగర్మున్సిపల్ కమీషనర్ పై దాడి శోచనీయం..

మున్సిపల్ కమీషనర్ పై దాడి శోచనీయం..

- Advertisement -

మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ ఆయజ్
నవతెలంగాణ – జమ్మికుంట

మహబూబ్ నగర్ మునిసిపల్ కమీషనర్ ప్రవీణ్ రెడ్డిపై మాజీ ప్రజా ప్రతినిధి బూతులు తిడుతూ, దాడి చేయడం శోచనీయమని, అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోసేషన్ పక్షాన ఆయన తీవ్రంగా ఖండిచారు. బుధవారం దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు.  మున్సిపల్ అభివృద్దికి అహర్నిశలు కష్టపడే ఒక అధికారిపై బూతులతో దాడి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అధికారితో ఎలా ప్రవర్తించాలో తెలియని వ్యక్తులపై తక్షణమే ప్రభుత్వం, ఉన్నతాదికారులు స్పందించి మున్సిపల్ అధికారులపై, సిబ్బందిపై దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ కమీషనర్ పై దాడి చేసిన వ్యక్తిపై నాన్ బెలబుల్ కింద అరెస్టు చేయాలని అయన ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసారు.

పగలు అనక, రేయి అనక ప్రజల కోసం, పట్టణ అభివృద్ధి కోసం కష్టించి పనిచేసే డిపార్ట్మెంట్ మున్సిపల్ మాత్రమేనని, ఇలాంటి దాడి చేసిన వ్యక్తిపై భవిషత్తులో ఎన్నికల్లో పోటి చేయకుండా కటిన చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఈ పోరాటం ఆగదని, ఈ పోరాటాన్ని ఉదృతం చేస్తామని, మునిసిపల్ కమీషనర్ ప్రవీణ్ రెడ్డి  వెంట జమ్మికుంట మునిసిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నామని, ఆయనకు జమ్మికుంట మునిసిపల్ పక్షాన సంఘీభావం తెలిపారు. దాడి చేసిన వ్యక్తిపై కటిన చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్ మహమ్మద్ ఆయజ్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఏ.ఈ వికాస్, జే ఏ ఓ  రాజశేకర్ రెడ్డి, టిపిబివో దీపిక, సీనియర్  అసిస్టెంట్లు భాస్కర్, వాణి, సానిటరీ ఇన్స్ పెక్టర్  మహేష్,  వార్డు ఆఫీసుర్లు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -