- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండింగ్ అవుతున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఒక పక్షి విమానానికి తగలడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. పక్షి ఢీకొనగానే అప్రమత్తమైన పైలట్ తన చాకచక్యంతో.. విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పక్షి తగలడం వల్ల విమానానికి స్వల్ప నష్టం జరిగిందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. పైలట్ సమయస్ఫూర్తి వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -