Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గట్టుప్పల  మండల అభివృద్ధి  మీద దృష్టి పెట్టండి

గట్టుప్పల  మండల అభివృద్ధి  మీద దృష్టి పెట్టండి

- Advertisement -

నవతెలంగాణ  -చండూరు
నూతనంగా ఏర్పడ్డ గట్టుప్పల్ మండలానికి  ఏం అవసరం ఉందో అభివృద్ధి  మీద దృష్టి పెట్టాలని 
చండూర్  మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం కాంగ్రెస్ నాయకులకు   సవాల్ చేశారు.
మంగళవారం గట్టుప్పల మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు   గట్టుప్పల్ అభివృద్ధిపై తెలిసి తెలియని సోయలేనోళ్లు చర్చకు రామ్మనీ అంటే నవ్వొస్తుందన్నారు.  బీఆర్ఎస్ పాల‌న‌లో మంజూరైన పనులే తప్పా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. దానికి తోడు మంజూరైన పనులను రద్దుచేసి మండల అభివృద్ధిని వెనుకకు నెట్టారన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కు రూ.1 కోటి టెండర్ అయింది. ప్రభుత్వ ఆస్ప‌త్రి భవన నిర్మాణం కోసం రూ.1.43 కోట్లు మంజూరయ్యాయి. దాని నిర్మాణానికి స్థలం సేకరణ చేయడంలో త‌మ‌ పాత్ర ఉందన్నారు. సబ్ సెంటర్‌కు మరో రూ.20 లక్షలు, వాయులపల్లి నుండి గట్టుప్పల్ వరకు బిటి రోడ్డు నిర్మాణం మంజూరు చేసి ప్రోసిడెంట్ తెప్పించిన‌ట్లు చెప్పారు. రిస్క్ తీసుకొని మంజూరు చేయించిన రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. అంతంపేట నుండి గట్టుప్పల్ రోడ్డు నిర్మాణం, గట్టుప్పల్ నుండి పుట్టపాక వరకు బీటీ రోడ్డు రెన్యూవల్, ఇడికూడ నుండి గట్టుప్ప‌ల్ వరకు సీఆర్ఎఫ్ ద్వారా రూ.30 కోట్లు మంజూరు అయిన‌ట్లు తెలిపారు. గట్టుప్పల్ నుండి లచ్చమ్మగూడెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరు చేపిస్తే ఈఎంసి దగ్గర పెండింగ్‌లో ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న‌ రజకుల కోసం రూ.10 లక్షల నిధులతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపించామన్నారు. రజకుల దగ్గర ఓట్లు వేయించుకుని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ దేన‌ని చెప్పారు. పాఠశాల పునర్నిర్మాణం కోసం రూ.10 లక్షలు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.7 లక్షలు మంజూరు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. రూ.3 కోట్లతో గట్టుప్పల్ నేతన్నలుకు క్లస్టర్ తెప్పించిన ఘనత త‌మ‌దేనన్నారు. 3 వందల మగ్గాలు పంపిణీ చేశామని చెప్పారు. కాంగ్రెస్ పాల‌న‌లో ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న మగ్గాలకు దిక్కు లేదని హేళన చేశారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా రూ.12 లక్షలతో 2వ వైకుంఠ ధామం తీసుకొచ్చిన ఘనత త‌న‌దేనన్నారు. రూ.10 లక్షలతో సొసైటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ముందడుగు వేసిన‌ట్లు తెలిపారు. రెండో వైకుంఠ ధామం నిర్మాణ శంకుస్థాపన బండను పీకేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర మీకేం విలువ ఉందో చెప్పాలన్నారు.

త్రిబుల్ ఆర్ బాధితుల‌కు అన్యాయం చేయ‌డం త‌గ‌దు
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మూడు సార్లు మార్చారు. గైడ్‌లైన్స్ నిబంధనలను మార్చి రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. తప్పిదారులకు అవకాశం ఇవ్వకుండా నిర్మాణం చేయాలని త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతుల భూములకు టెండర్ వేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. త్రిబుల్ ఆర్ ఫై రైతులకు ఉన్న భ‌యాల‌ను తొల‌గించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అవ్వారి శ్రీనివాస్, బీఆర్ఎస్ మర్రిగూడ మండల అధ్యక్షుడు తోటకూర శంకర్, మాజీ ఎంపిటిసి గొరిగి సత్తయ్య, అంతంపేట గ్రామ శాఖ హనుమంతు, నాయకులు పున్న కిషోర్, చిలుకూరి అంజయ్య, గంజి కృష్ణయ్య, పోరెడ్డి ముత్తిరెడ్డి, కర్నాటి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు జూలూరు పురుషోత్తం, కార్యదర్శి చిలువేరు అయోధ్య, కుకుడాల వినోద్, పున్న ఆనంద్, చెరుపల్లి రమేశ్‌, నరేశ్‌, వెంకటేశం, శ్రీనివాస్, నవీన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -