– మా గల్లీ మూలమలుపు వద్ద చెత్త వేయకుండా చూడాలి
– స్వచ్ఛందంగా శుభ్రం చేసి ముగ్గులు వేసినా గల్లీ వాసులు
– మునిసిపల్ అధికారులను కోరుతున్న 36వ వార్డు ప్రజలు
నవతెలంగాణ – కామారెడ్డిఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మనకు చేతనైన అంతవరకు మనమే చేసుకోవాలని ఓ సామెత ప్రకారం 36 వ వార్డు అక్షర స్కూల్ వెనుక లైన్ లోని గల్లీ లోపల ప్రజలు వారి గల్లీలో చెత్త వేయకుండా ఆ మూలమలుప వద్ద శుభ్రం చేసి ముగ్గులు వేసి అడ్డుగా చీరలను అడ్డంగా కట్టారు. మున్సిపల్ అధికారులకు చెప్పి చెప్పి విసిగి వేసారిపోయారు. దీంతో వారు వీరు వచ్చి చేసేది ఏమిటని ఆ కాలనీ, ఆ గల్లీ లోని నలుగురు ఐదుగురు కలిసి అ మూల మలుపు వద్ద ఉన్న చెట్టును తొలగించి శుభ్రం చేసి ముగ్గులు వేసి డ్రైనేజీ పక్కన చెత్త వేయకుండా చీరలను అడ్డంగా కట్టారు. అక్కడ కాలనీవాసులు ఉన్నంత సేపు చెత్త వేయడం లేదు వారు కొంచెం సేపు అక్కడ కనిపించకపోతే తిరిగి ఆ ఎదురుగా ఉన్న కాలనీ గల్లి వాళ్లు చెత్త వేస్తూ అక్కడ దుర్వాసన వచ్చే విధంగా చేస్తున్నారని ఆ గల్లీలోని ప్రజలు వాపుతున్నారు. ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి అక్కడ ఫ్లెక్సీ వేసి ఆ చుట్టుపక్కల ఇండ్ల వారికి చెత్త వేయడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించి అక్కడ చెత్త వేయకుండా చూడాలని గల్లీ ప్రజలు కోరుతున్నారు.