Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

- Advertisement -
  • – భారీగా పాల్గొన్న పార్టీ శ్రేణులు
    నవతెలంగాణ-యాదగిరిగుట్ట
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా చేపట్టే గిరిప్రదక్షిణలో రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. భక్తి భావంతో కొండ చుట్టూ ఆయన గిరిప్రదక్షిణ చేశారు. అనంతరం కొండపైకి చేరుకున్న మాజీ మంత్రికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు.
  • ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ ,టిఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య ,నాయకులు ఆవుల సాయి, గుణగంటి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
  • హరీష్ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు గిరిప్రదక్షిణకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రావడంతో ఆ పార్టీ మండల అధ్యక్షులు కర్రే వెంకటయ్య ఆధ్వర్యంలో భారీ స్వాతి ఏర్పాట్లు చేశారు పట్టణం మొత్తం హరీష్ రావు ఫ్లెక్సీలతో నిండిపోయింది గత మూడు పర్యాయాలుగా యాదగిరిగుట్టకు హరీష్ రావు వచ్చే పర్యటన వాయిదా పడడంతో నాలుగోసారి ఆయన రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -