Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంవినూత్నంగా బాలిస్టిక్‌ క్షిపణి ప్ర‌యోగం

వినూత్నంగా బాలిస్టిక్‌ క్షిపణి ప్ర‌యోగం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మొదటిసారి రైలుపై నుండి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని పరీక్షించింది. భారతదేశం గురువారం రైలు ఆధారిత మొబైల్‌ లాంచర్‌ సిస్టమ్‌ నుండి ఇంటర్మీడియట్‌ రేంజ్‌ అగ్ని ప్రైమ్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. భవిష్యత్‌ తరం క్షిపణి 2,000కి.మీ వరకు లక్ష్యాలను చేధించేలా రూపొందించబడిందని అన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన రైలు ఆధారిత మొబైల్‌ లాంచర్‌ నుండి నిర్వహించిన మొట్టమొదటి క్షిపణి ప్రయోగం. రైల్‌ నెట్‌వర్క్‌ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి, తక్కువ రియాక్షన్‌ టైమ్‌లో శత్రువుపై ప్రయోగించవచ్చు అని అన్నారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన డిఆర్‌డిఒ మరియు ఎస్‌ఎఫ్‌సి మరియు ఆర్మీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -