- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సి టి యు వద్ద (రఘునాథ చెరువు, మినీ ట్యాంక్ బండ్ నుండి) ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్, శ్రమదాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు , శానిటరీ సూపర్‌వైజర్, అల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, అల్ శానిటరీ జవాన్లు , ఎంఐఎస్ ఆపరేటర్, డిఆర్ సి సి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు.
- Advertisement -