Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంకేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లడఖ్‌లో నిర‌స‌న‌లు: సీపీఐ(ఎం)

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లడఖ్‌లో నిర‌స‌న‌లు: సీపీఐ(ఎం)

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లడఖ్‌ ప్రాంతాలను బీజేపీ మోసం చేసిందని సీపీఐ(ఎం) ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుధవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయ‌ని, ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్ డిమాండ్ చేసింది. ‘బీజేపీ మరోసారి ఆదివాసిలను, లేహ్‌, త్రిపర ప్రజలను మోసం చేసింది. పార్టీ కార్యాలయాలపై దాడి పరిష్కారం కానప్పటికీ.. వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడం బీజేపీపై ప్రజలకున్న కోపాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా నిరసనకారుల్ని అణచివేసేందుకు చూసిన పరిపాలన చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ అణచివేత చర్యల ఫలితమే నలుగురు ప్రాణాలు కోల్పోయారు’ అని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

కాగా, లడఖ్‌కి ప్రత్యేక రాష్ట్ర హోదాని డిమాండ్‌ చేస్తూ.. బుధవారంలేహ్ లో పెద్దఎత్తున నిరసనలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా బీజేపీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పంటిచారు. పోలీసులకి నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం లడఖ్‌లో కర్ఫ్యూ విధించబడింది. పట్టణాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -