నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలోనే విశ్వంలో శాశ్వత భారత్ అంతరిక్ష స్టేషన్ ప్రారంభించనున్నామని, అందుకు సంబంధించిన సన్నాహాలను ఇస్రో ముమ్మరం చేస్తుందని వ్యోమగామి, గ్రూప్ కెప్టన్ శుభాన్ష్ శుక్లా అన్నారు. ఇస్రో టీం ఓ ఆర్బింటింగ్ మ్యాడ్యుల్‌ను డిజైను చేసిందని, ఆ మ్యాడ్యుల్‌తో అంతరిక్షంలో భారతదేశానికి శాశ్వత స్థావరానికి దోహదం చేస్తుందని ఇండియా టుడే కాన్ క్లేవ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మ్యాడ్యుల్ చూడగానికి ఆరు పడకల అపార్టుమెంట్‌ను పోలి ఉంటుందని ఆయన వివరించారు. భారతీయ వ్యోమగాములు భూమి దిగువ కక్ష్యలో నివసించడానికి, ప్రయోగాలు చేయడానికి ఆ మ్యాడ్యుల్ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ సంవత్సరం జూలైలో చేపట్టిన ఆక్సియం-4 మిషన్ భాగంగా స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా విజయవంతంగా అంతరిక్ష కేంద్రంలో(ISS)కి వెళ్లివచ్చారు.
BAS మొదటి మాడ్యూల్ 2028 లో అంతరిక్షంలోకి వెళ్లనుందని ఇటీవల ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు. మొదటి మాడ్యూల్ 450 కి.మీ ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ (LEO) లో పూర్తిగా ఏర్పాటు చేయబడే BAS యొక్క ఐదు భాగాలలో మొదటిదని ఆయన పేర్కొన్నారు..